ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్ లో శనివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రమణయ్య మృతి చెందాడు. కుక్క అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పి కింద పడి తీవ్రంగా గాయపడిన రమణయ్యను స్థానిక పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై పలువురు అధికారులు విచారం వ్యక్తం చేశారు.