ప్రకాశం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా కల్పనా కుమారి శుక్రవారం ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ పదవిలో ఉన్న గోపాలకృష్ణ గుంటూరుకు బదిలీ అయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కల్పనా కుమారి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పరిచయం చేసుకున్నారు.