ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

256చూసినవారు
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని కే రాజుపాలెం గ్రామ సమీపంలో శుక్రవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెరువు వద్దకు వెళ్లిన శోభిత్ అనే యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. స్థానికులు అతన్ని వెలికి తీసేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్