ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గుర్తు తెలియని కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ ద్వారా ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.