ప్రకాశం జిల్లా ఒంగోలులోని హౌసింగ్ బోర్డు కాలనీలో రూ. 3.80 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్‌ను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లో-వోల్టేజ్ సమస్య పరిష్కారానికి 25 సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పీఎం సూర్య ఘర్ పథకాల ద్వారా విద్యుత్ మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.