ఒంగోలులోని ఓ ప్రైవేటు కళాశాలలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో డీఆర్డీఓ ఓబులేసు మాట్లాడుతూ, యువత ఓవర్ స్పీడ్ తో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. ప్రతి వాహనదారుడు రహదారి భద్రతా నియమాలు పాటించి ప్రమాదాల నుంచి రక్షింపబడాలని, ఇబ్బందులను సూచికలు తెలిసి ఉండాలని ఆయన అన్నారు. ఈ సమావేశానికి డీటీసీ సుశీల అధ్యక్షత వహించారు.