మాజీమంత్రి అంబటి పై ఒంగోలు ఎమ్మెల్యే ఆగ్రహం

275చూసినవారు
మాజీమంత్రి అంబటి పై ఒంగోలు ఎమ్మెల్యే ఆగ్రహం
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో, బాధ్యతాయుత రాజకీయ నాయకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి స్థాయి లేని వ్యక్తిగత దూషణలకు పాల్పడటం తగదని దామచర్ల పేర్కొన్నారు. అంబటి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్