ఒంగోలు: కలెక్టరేట్ వద్ద ఎమ్మార్పీఎస్ నాయకుల నిరసన

537చూసినవారు
కర్నూలు జిల్లా బొందిమడుగులకి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు టీఎం రమేశ్ దారుణ హత్యను ఖండిస్తూ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య ఆదేశాల మేరకు ఒంగోలు కలెక్టరేట్ వద్ద గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు కోటి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రమేశ్ హత్యకు కారకులైన వారిని శిక్షించే వరకు పోరాటం ఆగదని, వారి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్