దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మెలో వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఒంగోలులో బుధవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సార్వత్రిక సమ్మె కరపత్రాలను ఆవిష్కరించారు. కనీస మద్దతు ధరలు కల్పించకపోతే ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు.