పిల్లల పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలి

592చూసినవారు
పిల్లల పట్ల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలి
పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు మంగళవారం సూచించారు. సరదా కోసం పిల్లలు, యువకులు గ్రామాలు, పట్టణాల శివార్లలోని కుంటలు, చెరువులు, కాలువలు, బావుల వద్దకు లేదా ఈతకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని ఆయన కోరారు. పోలీసులు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండేలా ఆదేశించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్