ఈ నెల 2న ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన పోలీసు గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎస్పీ వి. హర్షవర్ధనరాజు రద్దు చేశారు. జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ఒంగోలుకు రావద్దని ఆయన కోరారు.