హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించిన ప్రకాశం ఎస్పీ

233చూసినవారు
హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించిన ప్రకాశం ఎస్పీ
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, పోలీసులు తమ విధి నిర్వహణలో కుటుంబానికి దూరంగా ఉంటూ విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తారని అన్నారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో శనివారం జిల్లా స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ సింగయ్యను ఎస్పీ శాలువా, పుష్పగుచ్చంతో సన్మానించారు. సింగయ్య తన విధుల్లో ప్రతిభ కనబరిచి సేవా పతకం, క్యాష్ రివార్డ్ అందుకున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్