ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లికి చెందిన కసుకుర్తి కార్తిక్ (23) ఒంగోలు IIIT క్యాంపస్‌లో B.Tech పూర్తిచేశాడు. గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతూ, ఇటీవల విడుదలైన తుది ఫలితాల్లో మొదటి ప్రయత్నంలోనే ASO (GAD)గా ఉద్యోగం సాధించాడు. అతని తండ్రి ట్రాక్టర్ డ్రైవర్‌గా, తల్లి కూలీ పనులకు వెళ్తుండగా, కార్తిక్ విజయం ఉపాధ్యాయులు, స్నేహితులు, తల్లిదండ్రులను సంతోషపరిచింది.