ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి పరికరాలు అందజేత

450చూసినవారు
ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి పరికరాలు అందజేత
దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన దివ్యాంగులకు 6 ట్రైసైకిళ్లు, 2 వీల్చర్లు, 4 వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. ఈ పరికరాలు వారి దైనందిన జీవనంలో సహాయకరంగా ఉంటాయని, వారి అవసరాలను గుర్తించి మరింత సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్