37వ జాతీయ రహదారి భద్రత మహోత్సవాలలో భాగంగా, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒంగోలులో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, పరిమితికి మించి ప్రయాణికులను తరలించరాదని సూచించారు. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలకు కలిగే నష్టాన్ని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం ఎస్పీ కార్యాలయం సమీపంలో జరిగింది.