టంగుటూరు రైల్వే అండర్ పాస్ వద్ద బుధవారం రాత్రి కొల్కతాకు చెందిన రాజా అనే వ్యక్తి రైలు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై వెళ్తుండగా, నిద్రమత్తులో బోగీ తలుపు వద్ద కూర్చుని ఉండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, 108 సిబ్బంది సుమారు 2 కిలోమీటర్లు రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్లి, బాధితుడిని స్ట్రెచర్పై అంబులెన్స్ వరకు మోసుకొచ్చి ఒంగోలు రిమ్స్ కు తరలించారు.