జిల్లాలో పెరిగిన వార్డుల సంఖ్య

269చూసినవారు
జిల్లాలో పెరిగిన వార్డుల సంఖ్య
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఏడు పురపాలక సంఘాల్లో వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చీరాల, మార్కాపురం, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి, దర్శి, గిద్దలూరు పురపాలక సంఘాల్లో వార్డుల సంఖ్యను పెంచారు. వార్డుల్లో ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, ఆయా మున్సిపాలిటీల కమిషనర్ల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్