పథకం ప్రకారమే దొంగలు చోరీ

432చూసినవారు
పథకం ప్రకారమే దొంగలు చోరీ
ఆదివారం తెల్లవారుజామున ఒంగోలులోని రాజీవ్ కాలనీలో దొంగలు ఒక బైక్‌ను దొంగిలించారు. ఆ తర్వాత, సంతపేట ఆంజనేయస్వామి గుడి వద్ద పాలబూత్‌లో శుభ్రం చేస్తున్న శేషమ్మ మెడలోని సుమారు నాలుగు సవర్ల బంగారు గొలుసును లాక్కొని, దొంగిలించిన బైక్‌పై పరారయ్యారు. దొంగలు ముఖాలకు మాస్కులు, బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్, వెనుక ఉన్న వ్యక్తి మంకీ క్యాప్ ధరించారు. ఈ ఘటనపై బాధితురాలు శేషమ్మ ఫిర్యాదు మేరకు ఒంగోలు టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు నరాచి హోటల్ వద్ద బైక్‌ను పార్క్ చేసి పారిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్