ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్పీ వి. హర్షవర్ధనరాజు మాట్లాడుతూ, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న నాన్బయిలబ్బుల్ వారెంట్లను ప్రత్యేక బృందాల ద్వారా అమలు చేయాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అసాంఘీక కార్యక్రమాలను అరికట్టడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.