శుక్రవారం అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఒంగోలు-విజయవాడ మార్గంలో వెళ్తున్న గూడ్స్ రైలు 34వ బోగీ చక్రాలు ఊడిపోయాయి. ఈ ఘటనతో ఒంగోలు మీదుగా వెళ్లే సుమారు 40 రైళ్లు ఆలస్యమయ్యాయి. అధికారులు గూడ్స్ రైలును మూడవ ట్రాక్‌లోకి మళ్లించి, పరిస్థితిని చక్కదిద్దారు. ఉదయం రైళ్ల రాకపోకలు గంట పాటు ఆలస్యమైనా, ఆ తర్వాత యథావిధిగా కొనసాగాయి.