ఒంగోలులోనే త్రిబుల్ ఐటీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఏపీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్, మంత్రి స్వామికి వినతి పత్రాన్ని అందజేశారు. శనివారం మంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లిన రాయపాటి జగదీష్, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని మంత్రి స్వామి ఈ సందర్భంగా తెలిపారు.