ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఆయన మాట్లాడుతూ, ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసుల స్థితిగతులను సమీక్షించారు. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.