లింగసముద్రం (M) పెంట్రాలకు చెందిన జయంపు గోవిందమ్మను, ఆమెతో సహజీవనం చేస్తున్న పాలకీర్తి వెంకటేశ్వర్లు కత్తితో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళపై అనుమానంతో వేధింపులకు పాల్పడుతున్న నిందితుడు ఈనెల 11న హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గుడ్లూరు CI నరేశ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి నిందితుడిని సాయిపేట గ్రామ శివారులో అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.