కరవది-అమ్మనబ్రోలు మధ్య రైల్వే ట్రాక్‌పై సోమవారం గుర్తు తెలియని యువకుడు రైలులో నుంచి జారిపడి మృతి చెందాడు. సుమారు 35 ఏళ్ల వయసున్న యువకుడు డిజైనర్ చొక్కా, గ్రీన్ కలర్ ప్యాంట్, కుడి చేతికి ప్లాస్టిక్ కడియం ధరించి ఉన్నాడు. అతని రెండు చేతులపై పచ్చబొట్లు ఉన్నాయని, సుమారు 5.6 అడుగుల ఎత్తు, చామనచాయ రంగులో ఉంటాడని రైల్వే ఎస్సై శ్రీరామ్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన, యువకుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, యువకుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.