
మొంథా తుఫాన్: సంతనూతలపాడులో చెరువు అలుగు, రహదారికి ముప్పు
సంతనూతలపాడులో మొంథా తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు, చెరువులు నిండుకుండలా మారాయి. సంతనూతలపాడులోని శివాలయం వద్ద ఉన్న చెరువు కూడా అలుగు పారుతోంది. తుఫాన్ ప్రభావం ఇలాగే కొనసాగితే, చీమకుర్తి మరియు సంతనూతలపాడు ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు.




































