చీమకుర్తిలో బస్సులు లేక అవస్థలు

2605చూసినవారు
ప్రకాశం జిల్లా చీమకుర్తి బస్టాండ్ సెంటర్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెలవు రోజుల్లో ఫ్రీ బస్ పథకం ప్రభావంతో రద్దీ విపరీతంగా పెరుగుతోందని, అయితే అందుకు తగ్గట్టుగా తగినన్ని బస్సులు నడపడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. చాలాసేపు బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అధికారులు సెలవు దినాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని బస్సులు నడపాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్