ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో కర్నూల్ రోడ్డు హైవేపై నిత్యం రద్దీగా ఉండే వాహనాల రాకపోకలకు బస్టాండ్ వద్ద సైడ్ డ్రైనేజ్ కాంట్రాక్టర్ రోడ్డుపై కంకర్, ఇసుక వేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మంగళవారం గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి రోడ్డుపై నుంచి కంకర్, ఇసుకను తొలగించాలని పోలీసులను గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సంఘటన వాహనదారులకు, స్థానికులకు ఇబ్బందికరంగా మారింది.