ఉపాధి హామీ పథకం అవకతవకలపై కలెక్టర్ ఆదేశాలతో విచారణ

323చూసినవారు
ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం చౌటపాలెంలో ఉపాధి హామీ పథకం అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టారు. కలెక్టర్ రాజాబాబుకు అందిన ఫిర్యాదు మేరకు ఆయన ఆదేశాలతో శుక్రవారం అధికారులు విచారణ జరిపి నివేదికను తయారు చేశారు. ఈ ప్రాంతంలో కొంతకాలంగా మస్టర్లు వేయడంలో అవినీతి జరుగుతోందని ఉపాధి కూలీలు ఆరోపించారు. ఏపీడి సుబ్బారావు విచారణ జరిపి నివేదికను సిద్ధం చేశారు.

సంబంధిత పోస్ట్