మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన కసుకుర్తి కార్తిక్ (23) B.Tech విద్యను ట్రిపుల్ ఐటీ (ఒంగోలు) క్యాంపస్ లో పూర్తి చేసి గ్రూప్స్ వైపు అడుగులు వేశారు. తొలి ప్రయత్నంలోనే ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన గ్రూప్-2 తుది ఫలితాల్లో ASO (GAD) గా ఎంపికయ్యారు. తల్లిదండ్రుల తోడ్పాటు, బంధుమిత్రుల సహకారం, సీనియర్ అభ్యర్థుల సూచనలు తన విజయానికి దోహదపడ్డాయని ఆయన తెలిపారు.