ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి చెందిన వల్లభనేని జ్యోతి గ్రూప్-1 పరీక్షల్లో అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె మద్దిపాడు మండలంలో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు ఆమెను అభినందించి, ఆమె సత్తా చాటారని కొనియాడారు.