రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

167చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నాగులుప్పలపాడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన పూల వాణిదాసు(57), తాటికొండ వెంకటప్పయ్య, మరో వ్యక్తితో కలిసి కొనుగోలు చేసిన ద్విచక్రవాహనంపై పెళ్లూరు వెళ్లి సోమవారం రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. ఈక్రమంలో నాగులుప్పలపాడు-ఇంకొల్లు రోడ్డులోని రేగులకుంట మూలమలపు వద్దకురాగా ద్విచక్రవాహనం అదుపుతప్పి కాలువలో పడి వాణిదాసు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఒంగోలు జీజీహెచ్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్