ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దాబా గుండ్లపల్లి పంజాబీ వద్ద బుధవారం మోటార్ సైకిల్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొనడంతో ఒంగోలుకు చెందిన చాగంటి సృజన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అద్దంకి నుంచి మోటార్ సైకిల్ పై వస్తున్న సృజన్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అతని తలకు బలమైన గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ వెంకటసూర్య, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.