బస్సు ఢీకొని ప్రయాణికుడి మృతి

189చూసినవారు
బస్సు ఢీకొని ప్రయాణికుడి మృతి
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద గురువారం ఉదయం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన గోనిపల్లి సుబ్బారావు (52) ఒంగోలు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా, తాను ఎక్కాల్సిన బస్సే అతన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాలైన సుబ్బారావును 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. మృతుడి కుమారుడు సాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రజియాసుల్తానా తెలిపారు.

సంబంధిత పోస్ట్