చీమకుర్తి మండలం ఆర్.ఎల్ పురం హైస్కూల్ విద్యార్థి తాళ్లూరు విజయ్ జాతీయస్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు హర్యానాలోని కురుక్షేత్రలో జరిగే 35వ జాతీయస్థాయి సబ్ జూనియర్ ఖో-ఖో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున విజయ్ ఆడనున్నారు. ఈ విషయాన్ని హైస్కూల్ హెచ్ఎం సీహెచ్ పద్మావతి శనివారం తెలిపారు.