చెరువు కట్టకు పొంచి ఉన్న ప్రమాదం

369చూసినవారు
చెరువు కట్టకు పొంచి ఉన్న ప్రమాదం
సంతనూతలపాడు పెద్ద చెరువు కట్టకు అక్కడక్కడా లీకులు ఏర్పడి రోడ్డుపైకి నీరు ప్రవహిస్తోంది. రెండు చోట్ల నీరు లీకవడంతో కట్ట తెగిపోతుందేమోనని గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. చెరువు నుంచి లీకైన నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో రోడ్డు చిద్రమై బురదగా మారడంతో వాహనాలు పడిపోయే ప్రమాదం ఏర్పడింది. అధికారులు వెంటనే స్పందించి చెరువు కట్ట లీకుల నియంత్రణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్