త్రిబుల్ ఐటీ ని ఒంగోలు లోనే ఉంచాలి

564చూసినవారు
త్రిబుల్ ఐటీ ని ఒంగోలు లోనే ఉంచాలి
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ను విద్యార్థి జేఏసీ నాయకులు బుధవారం కలిశారు. ఒంగోలులోనే త్రిబుల్ ఐటీ కాలేజ్ని కొనసాగించాలని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. 2016లో ఎన్నో పోరాటాల ద్వారా తెచ్చుకున్న త్రిబుల్ ఐటీని కనిగిరి ప్రాంతానికి తరలించడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని రాయపాటి జగదీశ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్