
పేకాట ఆడుతున్న ఐదు మంది అరెస్ట్
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వీరభద్రపురం గ్రామంలో సోమవారం పేకాట ఆడుతున్న ఐదుగురిని స్థానిక ఎస్సై చౌడయ్య అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 93,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని, పేకాట చట్టరీత్యా నేరమని ఎస్సై ప్రజలను హెచ్చరించారు.







































