మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతలకి చెందిన వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుడు బ్రహ్మయ్య తన ఖాతాలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ. 12 లక్షల 50 వేలు జమ అయినట్లు సోమవారం తెలిపారు. తన కుటుంబసభ్యులకు కూడా పరిహారం అందిందని, 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు.