వైయస్సార్ కాంగ్రెస్ గ్రామ కమిటీల నియామకం

528చూసినవారు
వైయస్సార్ కాంగ్రెస్ గ్రామ కమిటీల నియామకం
పెద్దారవీడు మండలం మద్దలకట్ట పంచాయతీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో పటిష్ఠం చేయడానికి గ్రామ కమిటీల నియామక కార్యక్రమం జరిగింది. యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయి నుంచి ప్రజలతో అనుబంధం పెంచుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్