శనివారం పుల్లలచెరువు మండల ఇంచార్జ్ తహసీల్దార్ గా దోర్నాల తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పుల్లలచెరువు తహసీల్దార్ వెంకటేశ్వరరావు సెలవులో ఉండటంతో, కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ దోర్నాల తహసీల్దార్ ను తాత్కాలికంగా నియమించారు. ఈ సందర్భంగా సిబ్బంది నూతన ఇంచార్జ్ తహసీల్దార్ కు స్వాగతం పలికారు.