ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఉప్పుల గుట్ట గ్రామంలో శనివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్డెన్ సెర్చ్ లో త్రిపురాంతకం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.