మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీపై ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్, మాజీ సీఎం వైఎస్
జగన్ మోహన్ రెడ్డిపై నానాజీ వ్యక్తిగత దూషణ చేశారని ఆరోపించారు. వెంటనే నానాజీపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులను చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.