త్రిపురాంతకంలోని బాల త్రిపుర సుందరీదేవి ఆలయంలో సోమవారం దసరా ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, అభిషేకం, కాలపూజ, బాల భోగము, గో పూజ, గణపతి పూజ, చండి హోమం వంటివి నిర్వహించారు. మొదటి రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు చేశారు.