వీరభద్రాపురం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు

729చూసినవారు
వీరభద్రాపురం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు
యర్రగొండపాలెం మండలంలోని వీరభద్రాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు వేడుకలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు పరీక్షల గురించి వివరించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎం.ఇ.ఓ.లు ఆంజనేయులు, మల్లు నాయక్ భవిష్యత్తు, ఉన్నత విద్య గురించి తెలియజేశారు. తెలుగు ఉపాధ్యాయులు నాగేశ్వర నాయక్ నేర్పిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్