కుందేళ్ళ మాంసం విక్రయించిన వ్యక్తికి జరిమానా

492చూసినవారు
కుందేళ్ళ మాంసం విక్రయించిన వ్యక్తికి జరిమానా
అడవి జంతువులైన 4 కుందేళ్లను చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తున్న షేక్ మాబు, షేక్ హుస్సేన్ సాహెబ్ అనే ఇద్దరికి రూ. 2 లక్షల జరిమానా విధించారు. గత నెలలో త్రిపురాంతకం మండలంలోని అన్నసముద్రం ప్రాంతంలో ఫారెస్టు అధికారులు వీరిని పట్టుకున్నారు. ఎర్రగొండపాలెం ఫారెస్టు రేంజర్ ప్రసన్న జ్యోతి శుక్రవారం ఈ వివరాలను తెలిపారు. అడవి జంతువులపై దాడి, మాంసం విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అడవుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అడవుల్లో ఉన్న ప్రతిదానినీ కాపాడాలని ఆమె ప్రజలకు సూచించారు. గురువారం రాత్రి కొలుకుల గ్రామంలో ప్రజలతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్