పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ ఛార్జ్

1214చూసినవారు
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ ఛార్జ్
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లన్నీ ప్రతినెల 1వ తేదీలోపే ఇంటి వద్దనే అందిస్తున్నామని, సెలవు వస్తే ముందు రోజే పెన్షన్లు అందిస్తున్నామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్