మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. నూతన సిసి రోడ్ల నిర్మాణంతోపాటు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు రూ. 60 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎరిక్షన్ బాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.