గ్రంథాలయంలో జాషువా, భగత్ సింగ్ జయంతి వేడుకలు

1442చూసినవారు
గ్రంథాలయంలో జాషువా, భగత్ సింగ్ జయంతి వేడుకలు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆదివారం, కవి గుర్రం జాషువా 130వ జయంతి మరియు భగత్ సింగ్ 118వ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా, గ్రంథపాలకుడు జి. రామాంజీ నాయక్, సాహితీవేత్త గొట్టిముక్కుల నాసరయ్య మాట్లాడుతూ, జాషువా రచించిన 'గబ్బిలం' అంటరానితనంపై చర్చలకు దారితీసిందని, భగత్ సింగ్ ఆశయాలు, పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్