సింగరాయకొండ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జులై 1న జరిగే కళ్యాణం, రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా సీఐ శ్రీహరి, ఎస్సై సుధీర్ కుమార్ ముందస్తు చర్యలు చేపట్టారు. అదనపు పోలీస్ బలగాలు, రోప్ పార్టీలను రంగంలోకి దించుతున్నట్లు ఎస్సై తెలిపారు. ట్రాఫిక్, క్యూలైన్లు, దర్శన టికెట్ల వద్ద భక్తులు సంయమనం పాటించాలని మంగళవారం అధికారులు కోరారు.