రాష్ట్రంలో ప్రస్తుతం క్యాష్–రాజేష్–లోకేష్ అనే సింగిల్ విండో పాలన నడుస్తోందని, ఈ ఫార్ములాతో ప్రతి వర్గాన్నీ మోసం చేశారని వై.ఎస్.
జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. రెండేళ్లలోనే చంద్రబాబు రూ. 3. 60 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆర్థిక లోటును పెంచి ఖజానాను ఖాళీ చేశారని ఆయన విమర్శించారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విఫలమయ్యారని
జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెప్పుకునే విజయాలు కూడా లేవని ఆయన అన్నారు.